HDFC బ్యాంకు మహిళలకు బంపర్ ఆఫర్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC మహిళల కోసం ప్రత్యేక అకౌంట్ ను ముందుకు తీసుకొచ్చింది.మహిళలు ఇందులో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే భారీ ప్రయోజనాలను అందు కోవచ్చు. ఈ హెచ్డీఎఫ్సీ బ్యాంకు మహిళల కోసం సేవింగ్స్ అకౌంట్ కి ప్రత్యేక ఆఫర్లను అందజేస్తుంది. ఈ అకౌంట్ ద్వారా ప్రమాద మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా లభిస్తుంది. ఆసుపత్రిలో చేరితే రూ.లక్ష వరకు బీమా కవరేజీ ఉంటుంది. ఈ ప్రయోజనం పొందడానికి HDFC బ్యాంకును సంప్రదించవచ్చు.