ఆగస్టు 11న NEET-PG పరీక్ష
తెలంగాణ telangana News భారత్ ప్రతినిధి : దేశంలో in the country వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నీట్- పీజీ 2024 (NEET PG 2024) పరీక్ష తేదీ Date of Examination ఖరారైంది. ఆగస్టు 11న పరీక్ష నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ Exam paper లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒకరోజు ముందు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించారు.
గత ఏడేళ్లుగా నీట్ పీజీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ Examinations ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు పేపర్ లీకేజీ ఆరోపణలు రాలేదు. అయితే, నీట్-యూజీ 2024 పరీక్షపై దేశ వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఆన్లైన్లో నిర్వహించబోయే నీట్-పీజీకి కేవలం 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి పరీక్ష test కేంద్రాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా ఇటీవల కథనం వెల్లడించింది.





