Type Here to Get Search Results !

Sports Ad

ఎమ్యెల్యేలు,ఎమ్యెల్సీ దడ పుటిస్తున్నా ప్రభుత్వం MLAs and MLCs are throbbing, but the government

 

ఎమ్యెల్యేలు,ఎమ్యెల్సీ దడ పుటిస్తున్నా ప్రభుత్వం ?

* హైడ్రా నివేదికలో పలు ప్రముఖుల భవంతులు 
* హైడ్రా నివేదికలో ఏముంది ? పలు ప్రముఖుల భవంతులు 
* 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
* పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు
* కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ్ గోస్వామి
* లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజులరామారం, అమీర్ పేట్
* అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్

హైదరాబాద్ Hyderabad News భారత్ న్యూస్ ప్రతినిధి : హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల పై తాజాగా ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. నగరం నలువైపులా కొన్ని చెరువులు, కుంటలు, నాలా లతో పాటు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణా లపైకి హైడ్రా బుల్డోజర్స్ వెళ్తోన్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఒక ఎత్తయితే.. నిన్న కూల్చిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ మరో ఎత్తు. ఇదేకాకుండా ఒకరి ద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం చెరువులను, కుంటలను కబ్జా చేసి నిర్మించిన స్థలాల్లోని నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేసింది.

దీంతో చెరువులను, నాలాలను ఆక్రమించి అక్రమ కట్టడాల నిర్మాణం చేపట్టిన వాళ్ల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది.హైడ్రా కూల్చబోయే తరువాతి జాబితాలో ఇంకా ఎవరెవరు ఉండుంటారు అనే సస్పెన్స్ అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందించడం ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైడ్రా నివేదికలో ఏముందనేదే ఆ ఆసక్తికి కారణమైంది.ఇంతకీ హైడ్రా నివేదికలో ఏముంది ? హైదరాబాద్ నగరం పరిధిలో ఇప్పటి వరకు 18 వేర్వేరు చోట్ల కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది.

ఆ జాబితాలో అక్కినేని నాగార్జున, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు, బహదూర్‌పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, మంథని బీజేపి నేత సునిల్ రెడ్డి, నందగిరి హిల్స్‌లో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుడు నిర్మించిన కట్టడం, ప్రొ కబడ్డి లీగ్ యజమాని అనుపమ, కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాలు ఉన్నాయి.

ఇవేకాకుండా బంజారా హిల్స్, లోటస్ పాండ్, అమీర్‌పేట, గాజుల రామారం, మన్సూరాబాద్ ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మా ణాలపై ఫోకస్ చేసినట్టు హైడ్రా నివేదికలో పొందుప రిచారు. 18 చోట్ల కూల్చిన నిర్మాణాల మొత్తం స్థలం 43.94 ఎకరాల వరకు ఉందని హైడ్రా తమ నివేదికలో స్పష్టంచేసింది. ఈ అధికారిక నివేదిక ప్రభుత్వానికి అందక ముందు వరకు హైడ్రా కూల్చిన నిర్మాణాల స్థలాల మొత్తం దాదాపు 100 ఎకరాల వరకు ఉంటుందనే టాక్ వినిపిం చింది. కానీ అసలు స్థలం అందులో సగమేనని ఈ నివేదిక వెల్లడించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies