సర్పంచ్ గా పోటీ చేయాలంటే...ఇవి అర్హతలు
* జనవరిలో పంచాయతీ ఎన్నికలు
* డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల
* జనవరి 7న నోటిఫికేషన్
* మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు
బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు పై కసరత్తు.తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం.జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం.ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉప సర్పంచ్ ఎన్నిక.
అర్హులు వీరే...
✦ సర్పంచ్/వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు.
✦ జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు.
✦ ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత.
✦ ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అర్హత
✦ రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది
✦ పోటీకి కనీస వయసు 21 ఏళ్లు
✦ పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి
✦ వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరుగా ఉండాలి
✦ రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు అర్హులు
✦ స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు
✦ దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటుచేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు
✦ ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రెటరీలు పోటీకి అనర్హులు
✦ ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులు. ఇది గవర్నమెంట్ జీవో