Type Here to Get Search Results !

Sports Ad

ఎంఎస్ఎంఈ-2024 పాలసీని రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Released The MSME-2024 Policy

ఎంఎస్ఎంఈ-2024 పాలసీని రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ-2024 పాలసీని విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎంఎస్ఎంఈ-2024 పాలసీని బుధవారం విడుదల చేశారు. జీఎస్డీపీలో ఎక్కువ వాటా కలిగిన ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని కొద్ది నెలల క్రితమే సీఎం రేవంత్​ రెడ్డి, ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలోనే ఐదారు అంశాల్లో ఎంఎస్ఎంఈలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుర్తించినట్టు తెలిసింది. వాటికి పరిష్కారాలు చూపించడంతో పాటు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా మరిన్ని విధానాలను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.
రాష్ట్రంలోని మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీలు గండాలు దాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలసీతో ముందుకొచ్చింది.

 లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆయా పరిశ్రమలు కరోనా తర్వాత చాలా వరకు డీలా పడ్డాయి. వేలాది కంపెనీలు మూతపడగా వేలాది మంది ఉపాధిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే, గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. వేలాది కంపెనీలు మూతపడినా వాటిని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నించలేదన్న విమర్శలున్నాయి.

 ఈ నేపథ్యంలోనే ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో 26 లక్షలకుపైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అయితే, కరోనా తర్వాత వేలాది సంస్థలు మూతపడ్డాయి. వర్కింగ్​ క్యాపిటల్​ లేక, పనిచేసే వారు దొరక్క.. సంస్థలను చాలా మంది మూసేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సంస్థల్లో 56 శాతం సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మరో 44 శాతం పట్టణాల్లో ఉన్నాయి.

 అయితే, రూరల్​ ఏరియాల్లో మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పదేండ్లలో కేవలం 19,954 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రీస్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​) 30 వరకు ఇండస్ట్రియల్​ పార్కులను ఏర్పాటు చేయగా 2,700 ఎకరాల వరకు ల్యాండ్​ను ఎంఎస్​ఎంఈలకు ఇచ్చింది. ఆరు కొత్త పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగా మరో 12 పార్కులను అప్​గ్రేడ్​ చేస్తున్నారు.

Focusing on the problems faced by MSMEs, the state government released the MSME-2024 policy. CM Revanth Reddy released the MSME-2024 policy on Wednesday. A few months ago, CM Revanth Reddy said that a special policy will be brought for MSMEs, which have a large share in GSDP.

 In this context, it is known that MSMEs are facing serious difficulties in five or six aspects. CM Revanth Reddy announced on this occasion that he will bring more policies to encourage MSMEs along with solutions to them. Micro, Small,

 Most of the industries that provide employment to lakhs of people have been shut down after Corona. Thousands of companies have closed and thousands of people have lost their jobs. However, there are allegations that the previous government did not care about MSMEs. There are criticisms that thousands of companies have closed but no attempt has been made to reopen them.

 However, opinions are being expressed that there is a need to provide infrastructure in rural areas. On the other hand, only 19,954 units were established in these ten years. TGIIC (Telangana Industries Infrastructure Corporation) has established up to 30 industrial parks across the state.

మరిన్ని వార్తల కోసం....  
* వావ్​ అద్భుతం కొత్త బ్రెయిన్ను తయారు చేశారు ఇక్కడ క్లిక్ చేయండి
* స్కూల్ బస్సులో మంటలు భయంతో పిల్లల కేకలు ఇక్కడ క్లిక్ చేయండి
* బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం ఇక్కడ క్లిక్ చేయండి
* యాదాద్రి నర్సన్న హుండీ లెక్కింపు షురూ ఆగస్టులో ఎంతొచ్చిందో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies