Type Here to Get Search Results !

Sports Ad

వావ్​ అద్భుతం కొత్త బ్రెయిన్ను తయారు చేశారు Wow Awesome New Brain Made

వావ్​ అద్భుతం కొత్త బ్రెయిన్ను తయారు చేశారు

జాతీయ National News భారత్ ప్రతినిధి : మనిషి కూర్చున్న చోటి నుంచే జస్ట్ ఆర్డర్ వేస్తే చాలు మ్యూజిక్ వినిపించడం, టీవీ ఆన్ చేయడం, లైట్లు, ఫ్యాన్లు వేయడం, ఆపేయడం దగ్గర నుంచి ఇంట్లో దాదాపు అన్ని పనులూ చేసి పెట్టే అమెజాన్ అలెక్సా వంటి స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. కానీ వీటన్నింటికీ నోటి మాట ద్వారానో లేదంటే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో క్లిక్ చేయడం ద్వారానో మాత్రమే ఆదేశాలు ఇవ్వగలం.

 మరి పక్షవాతంతోపాటు ఇతర అనారోగ్యాల వల్ల వీల్ చైర్ కే పరిమితమైపోయి కనీసం మాట్లాడలేని, శరీరాన్ని కదిలించలేని వ్యక్తుల మాటేమిటి ఇకపై ఇలాంటి వారు కూడా డిజిటల్ అసిస్టెంట్లను ఈజీగా వినియోగించవచ్చని, జస్ట్ వారు మెదడులో ఆలోచిస్తే చాలు.. ఆ ఆలోచనలను అర్థం చేసుకుని డిజిటల్ అసిస్టెంట్లు పని చేసేలా చేయొచ్చని అమెరికాలోని ‘సింక్రన్’ అనే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ కంపెనీ చెప్తోంది.

 తాము తయారు చేసిన బ్రెయిన్ ఇంప్లాంట్​ను కండరాల బలహీనత, పక్షవాతానికి కారణమయ్యే అమయోట్రోఫిక్ లాటరల్ స్క్లిరోసిస్  వ్యాధి బారిన పడిన మార్క్ అనే 64 ఏండ్ల వృద్ధుడి మెదడులోని రక్తనాళంపై అమర్చి చూడగా, అది సక్సెస్ ఫుల్​గా పనిచేసిందని ఆ కంపెనీ సోమవారం ప్రకటించింది.

ఇలా ఆలోచిస్తే అలా పనులైనయ్....
మార్క్ ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ ఇంప్లాంట్ అమెజాన్ ఫైర్ ట్యాబ్లెట్ లో ఐకాన్ లను క్లిక్ చేసిందని, తద్వారా అమెజాన్ అలెక్సాకు ఆదేశాలు అంది అది కోరుకున్న పనులను చేసి పెట్టిందని వెల్లడించింది. మార్క్ ఆలోచనల మేరకు వీడియో కాల్స్ చేయడం, మ్యూజిక్ వినిపించడం, వీడియోలు చూపించడం, స్మార్ట్ లైట్లు, ఫ్యాన్ల వంటివి ఆన్, ఆఫ్ చేయడం, ఆన్ లైన్ లో షాపింగ్ చేయడం, బుక్స్ చదివి వినిపించడం వంటివి బ్రెయిన్ ఇంప్లాంట్ ఆదేశాలతో అలెక్సా చేసి పెట్టిందని ఆ కంపెనీ వివరించింది.

 ‘‘ఈ ఇంప్లాంట్​తో నేను కోల్పోయిన స్వతంత్రతను మళ్లీ పొందినట్టు అనిపించింది. నా చుట్టూ నాకు కావాల్సిన పనులను మేనేజ్ చేసుకోగలగడం, కోరుకున్నట్టు వినోదం పొందగలగడం చాలా బాగుంది” అని మార్క్ సంతోషం వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కాగా, బిలియనీర్ ఎలాన్ మస్క్​కు చెందిన న్యూరాలింక్​తో పాటు పలు కంపెనీలు కూడా ఇలాంటి బ్రెయిన్ ఇంప్లాంట్లను తయారు చేస్తున్నాయి.

Smart digital assistants such as Amazon Alexa, which can do almost all the tasks at home, from playing music, turning on the TV, turning on the lights and fans, and turning off the lights and fans, have become commonplace. But for all these, whether through word of mouth or smart phones,

 And what about people who are confined to a wheelchair due to paralysis and other illnesses and cannot at least speak or move their body, these people can use digital assistants easily, they just need to think in their brains.

 The company announced on Monday that the brain implant they made was implanted on a blood vessel in the brain of a 64-year-old man named Mark, who was affected by amyotrophic lateral sclerosis, a disease that causes muscle weakness and paralysis.

మరిన్ని వార్తల కోసం....  
* స్కూల్ బస్సులో మంటలు భయంతో పిల్లల కేకలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎంఎస్ఎంఈ-2024 పాలసీని రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం ఇక్కడ క్లిక్ చేయండి
* యాదాద్రి నర్సన్న హుండీ లెక్కింపు షురూ ఆగస్టులో ఎంతొచ్చిందో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies