Type Here to Get Search Results !

Sports Ad

ట్రంప్ను చంపాలని చూసింది వీడే వయస్సు 58 ఏళ్లు కానీ పెద్ద క్రిమినల్ మైండ్ Weede Is 58 Years Old But A Big Criminal Mind Who Tried To Kill Trump

ట్రంప్ను చంపాలని చూసింది వీడే వయస్సు 58 ఏళ్లు కానీ పెద్ద క్రిమినల్ మైండ్

జాతీయ National News భారత్ ప్రతినిధి : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను టార్గెట్ చేసి కాల్పులు జరిపిన వ్యక్తిని అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్ (FBI) గుర్తించింది. ట్రంప్పై కాల్పులకు యత్నించిన వ్యక్తిని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ అని ఎఫ్బీఐ తెలిపింది. నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోకు చెందిన ర్యాన్ గతంలో కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేశాడు. డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారుడు. అతనికి ఎలాంటి మిలటరీ బ్యాగ్రౌండ్ లేదు. కాకపోతే యుద్ధంలో తానూ పాలు పంచుకోవాలని, పోరాడుతూ ప్రాణం పోయినా పర్లేదనే మనస్తత్వం ర్యాన్కు ఉన్నట్లు అతని సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలించగా తెలిసింది. 

 మరీ ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం పట్ల ర్యాన్ అమితాసక్తితో ఉండేవాడు. ఉక్రెయిన్లో పోరాడి యుద్ధంలో ప్రాణాలు వదిలేయాలని ఉందని తన ‘ఎక్స్’ ఖాతాలో ర్యాన్ వెస్లీ రౌత్ బహిరంగంగా తన బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ర్యాన్ రౌత్ ఉక్రెయిన్ మద్దతుదారుడు. అంతేకాదు..  ర్యాన్ వెస్లీ రౌత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. భవిష్యత్ యుద్ధాలు ఆగాలంటే పౌరులు యుద్ధ శైలిని మార్చుకోవాలని సిగ్నల్ మెసేజింగ్ యాప్ ప్రొఫైల్లో ర్యాన్ రాసుకొచ్చాడు.

The American intelligence agency Federal Bureau of Investigation (FBI) has identified the person who targeted and shot the former President of the United States and the presidential candidate of the Republican Party, Donald Trump. The FBI has identified 58-year-old Ryan Wesley Routh as the man who attempted to shoot Trump.

 Ryan was particularly passionate about the Ukraine-Russia war. Ryan Wesley Routh has publicly expressed his strong desire to fight in Ukraine and die in the war on his 'X' account. In short, Ryan Routh is a supporter of Ukraine. Not only that.

మరిన్ని వార్తల కోసం.... 
* స్టూడెంట్స్‌కు RBI బంపర్ ఆఫర్ రూ.10లక్షలు గెలుచుకునే ఛాన్స్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఊరేగింపులో ఉద్రిక్తత పోలీస్ వాహనంలోనే నిమజ్జనానికి విగ్రహం ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ ట్విస్ట్ శేఖ‌ర్ బాషా ఇలా మధ్యలోనే ఎలిమినేట్ కారణం ఇదేనా ఇక్కడ క్లిక్ చేయండి
* ఎడాపెడా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా అతిగా మింగితే ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies