గైక్వాడ్ కాళ్ళు మొక్కిన అభిమాని అనంతపురంలో భద్రతపై ప్రశ్నలు
జాతీయ National News భారత్ ప్రతినిధి : దులీప్ ట్రోఫీలో భాగంగా ఒక అరుదైన సంఘటన జరిగింది. ఇండియా సి జట్టు కెప్టెన్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి రుతురాజ్ గైక్వాడ్ పాదాలను తాకేందుకు ఒక అభిమాని గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. గైక్వాడ్ పాదాలు మొక్కి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి ఎవరికీ హానీ చేయలేదు. తమ ఫేవరేట్ ఆటగాళ్లను కలుసుకోవడానికి గ్రౌండ్ లోకి రావడం కామన్. అయితే ఈ సంఘటన అనంతపురంలోని భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ప్రస్తుతం అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలోని దులీప్ ట్రోఫీ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దులీప్ ట్రోఫీలో ఇండియా సి వర్సెస్ డి మ్యాచ్ గురువారం (సెప్టెంబర్ 5) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కు సరైన భధ్రత కనిపించట్లేదనే వార్తలు వస్తున్నాయి. గైక్వాడ్ ను కలుసుకోవడానికి అభిమాని చాలా స్వేచ్ఛగా లోపలి వచ్చినట్టు సమాచారం. అయితే ఏదైన ప్రమాదం జరిగితే ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. తొలిసారి అనంత పురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ లు జరగడం విశేషం.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండు జట్లు నువ్వా, నేనా అన్నట్టు ఆడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా–డి బ్యాటింగ్‌లో ఫెయిలైంది. అక్షర్ పటేల్ (86) ఒంటరి పోరాటం చేసినా తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 164 రన్స్‌కే కుప్పకూలింది. విజయ్‌కుమార్ (3/19), అన్షుల్ కాంబోజ్ (2/47), హిమాన్షు చౌహాన్ (2/22) దెబ్బకు ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా–సి 168 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. హర్షిత్ రానా 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా- డి ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
A rare incident happened as part of the Duleep Trophy. A fan rushed to the ground to touch the feet of Chennai Super Kings captain Ruthuraj Gaikwad, the captain of the India C team in the IPL. Gaikwad stomped his feet and left. The man did not harm anyone. It is common to come to the ground to meet their favorite players. But the incident raises questions about security in Anantapur.
Duleep Trophy matches are currently being played at the Rural Development Trust Stadium in Anantapur. As part of this, the India C vs D match in the Duleep Trophy started on Thursday (September 5). There are reports that there is no proper security for this match. It is reported that the fan came in very freely to meet Gaikwad. But the questions are coming what if any accident happens. Duleep Trophy matches are being held in Anantapur for the first time.
When it comes to this match, both the teams are playing like you and me. Batting first, India-D failed in batting. Akshar Patel (86) put up a solitary fight but collapsed to 164 runs in 48.3 overs in the first innings. Vijay Kumar (3/19), Anshul Kamboj (2/47) and Himanshu Chauhan (2/22) were limited to six figures in the innings. India who batted the gap – C.
మరిన్ని వార్తల కోసం....
* గణేష్ మండపాల దగ్గర పోలీస్ ఆంక్షలు కండీషన్స్ ఇవే ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ దేశంలోనే అతి పెద్దది ఇక్కడ క్లిక్ చేయండి
* గైక్వాడ్ కాళ్ళు మొక్కిన అభిమాని అనంతపురంలో భద్రతపై ప్రశ్నలు ఇక్కడ క్లిక్ చేయండి
* నేనే రైతు బిడ్డనే వాళ్ల కష్టాలు నాకు బాగా తెలుసు శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అవసరం లేదు కీలక ప్రకటన చేసిన గడ్కరీ ఇక్కడ క్లిక్ చేయండి





