గోల్కొండలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. శనివారం రాత్రి దాదాపు గంటన్నర పాటు ఏకధాటిగా వాన పడింది. వరుణుడి బీభత్సంతో భాగ్యనగరం జలమైంది. వర్షం దంచికొట్టడంతో నగరంలోని రోడ్లు చెరువులను తలపించాయి. లో తట్టు ప్రాంతాలు జలమయం కాగా కొన్ని చోట్ల మోకాళ్ల లోతు వరకు నీరు రోడ్లపై నిలిచిపోయింది.
ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. సిటీలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే లో తట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఏ ఏ ఏరియాల్లో ఎంత వర్షపాతం నమోదు అయ్యిందనే గణాంకాలను విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భువనగిరిలో 10.3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తర్వాత హైదరాబాద్ గోల్కొండలో 9.1 సెం. మీ వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
It rained heavily in Hyderabad. It rained continuously for about an hour and a half on Saturday night. Bhagyanagara was flooded by the wrath of Varuna. Roads in the city looked like ponds due to heavy rain. In some areas, waterlogged areas were standing knee-deep on the roads.
Due to the sudden torrential rain, the traffic was paralyzed everywhere in the city. There was heavy traffic jam in the main intersections of the city. As a result, vehicles were stuck for kilometers on the roads. Immediately, the GHMC staff took supportive measures in the affected areas.
Traffic police are clearing the vehicular traffic on the roads. In this order, the officials revealed the details of rainfall across the state along with Hyderabad. The statistics of how much rainfall has been recorded in which areas have been released. Yadadri Bhuvanagiri district receives the highest rainfall.