ఎస్సీ గురుకుల బ్యాక్ లాగ్ ఎంట్రన్స్ రిజల్ట్ విడుదల 5,638 మంది స్టూడెంట్లకు సీట్లు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఎస్సీ గురుకుల సొసైటీ గురుకులాల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి 6,7,8,9వ క్లాసుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను రిలీజ్ చేశామని సెట్ కన్వీనర్, సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు.
6వ తరగతిలో 2,464 మంది, 7వ తరగతిలో 1046 మంది, 8వ తరగతిలో 918 మంది, 9వ తరగతిలో 1,210 మంది చొప్పున 5,638 మంది సెలక్ట్ అయ్యారని సెట్ కన్వీనర్ వెల్లడించారు.