మా ఇంటికి మరో చిట్టితల్లి వచ్చింది హీరోయిన్ శ్రీలీల ఎమోషనల్ పోస్ట్
Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : సౌత్ లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) పోస్ట్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లేటెస్ట్గా (2025 ఏప్రిల్ 27న) తన ఇంస్టాగ్రామ్లో ఓ చిన్నారితో దిగిన రెండు ఫొటోలను షేర్ చేసింది.
ఈ ఫొటోస్కి "ఇంటికి అదనంగా హృదయాలపై దండయాత్ర" అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్ చాలా స్పీడ్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో శ్రీలీల పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఈ ఫొటోల్లో శ్రీలీల ఆ చిన్నారి పాపను ఆప్యాయంగా గుండెలకి హత్తుకుంది. మరొక దానిలో పాప బుగ్గపై శ్రీలీల ముద్దు పెడుతూ కనిపిస్తూ ఆకర్షిస్తోంది. ఈ ఫొటోస్ చూసిన ఆమె ఫ్యాన్స్ వీపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం అసలు ఈ పాప ఎవరు? శ్రీలీల సీక్రెట్గా పెళ్లి చేసుకుందా? లేక తన ఇంట్లో పాపానా అంటూ పాపా గురించి పలు ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు.
అయితే, శ్రీలీల ఈ పాపని దత్తతు తీసుకున్నట్లు మరికొంత మంది నెటిజన్లు క్లారిటీ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో మానవత్వాన్ని చాటుకున్న శ్రీలలపై, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సెలబ్రేటిస్ అందరూ ఇలానే మానవత్వాన్ని చాటుతుంటే, అనాథలు కనిపించరు కదా అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.