అది గొడవ కాదు చిన్న వాదన: రాహుల్‌పై కోహ్లీ సీరియస్ అసలేం జరిగిందంటే
Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 27) అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. విరాట్ క్రీజులో ఉన్నప్పుడు రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు ఒకరినొకరు సీరియస్ గా మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఈ సీన్ చూసి ఏదో పెద్ద గొడవ జరిగిందనే ప్రచారం చేశారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఆర్సీబీ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లే తర్వాత ఇన్నింగ్స్ ను స్లో చేసింది. బంతికి బంతికి మధ్య టైం ఎక్కువగా తీసుకుంది. విప్రజ్ నిగమ్ ఏడో ఓవర్లో నో బాల్ వేయగా కృనాల్ పాండ్య ఫోర్ కొట్టాడు. తర్వాత బంతి ఫ్రీ హిట్ కావడంతో ఢిల్లీ ఫీల్డింగ్ మార్చడానికి టైం తీసుకుంది. రూల్స్ ప్రకారం ఫ్రీ హిట్ సమయంలో లేకపోతే ఆటగాడు నాన్ స్ట్రైకింగ్ కు వెళ్లకపోతే ఫీల్డ్ సెటప్ మార్చకూడదు. కానీ ఢిల్లీ ఫీల్డింగ్ మారుస్తూ టైం వేస్ట్ చేసింది. ఇది విరాట్ కోహ్లీకి నచ్చలేదు.