Type Here to Get Search Results !

Sports Ad

శుభవార్త తగ్గనున్న వంటనూనెల ధరలు దిగుమతి సుంకం 10% తగ్గింపు Good News Cooking Oil Prices To Come Down, Import Duty Reduced By 10%

శుభవార్త తగ్గనున్న వంటనూనెల ధరలు దిగుమతి సుంకం 10% తగ్గింపు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : చాలాకాలం నుంచి మధ్యతరగతి ప్రజలు పెరిగిన వంటగది ఖర్చులతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువగా వారిని ఇబ్బంది పెడుతోంది భారీగా పెరిగిన వంటనూనెల ధరలే. వాస్తవానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిన సంగతి తెలిసిందే. 

 అయితే తాజాగా భారత ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంటనూనెలపై సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మే 30నుంచి తగ్గించిన సుంకాలు అమలులోకి వస్తాయని పేర్కొంది. దేశీయ డిమాండ్ కారణంగా దిగుమతి చేసుకుంటున్న సోయా ఆయిల్, పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. వీటిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం గతంలో ఉన్న 20 శాతం నుంచి ప్రస్తుతం 10 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది.

 ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న ముడి వంటనూనెల పన్ను తగ్గింపుతో ప్రజలకు తగ్గింపు ప్రయోజనాలు అందటం ద్వారా భారం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వంటనూనెల దిగుమతుల సుంకంపై అదనంగా అగ్రి ఇన్ ఫ్రా సెజ్, సోషల్ వెల్ఫేర్ సర్ ఛార్జీలతో కలిపి గతంలో దిగుమతులపై ఉన్న సుంకం 27.5 శాతం నుంచి ప్రస్తుత తగ్గింపు తర్వాత 16.5 శాతానికి చేరుకుంది. 

 ఇదే క్రమంలో శుద్ధి చేయబడిన వంటనూనెల దిగుమతులపై సుంకం మాత్రం 32.5 శాతం వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే సెజ్ కలిగిన తర్వాత ఇది 35.75 శాతంగా ఉంది. దేశీయంగా ఉన్న ఆయిల్ విక్రయ కంపెనీల వ్యాపారాన్ని కాపాడే ఉద్దేశంతోనే ప్రభుత్వం రిఫైన్ చేయబడిన వంటనూనెల దిగుమతులపై భారీ సుంకాన్ని అమలులో ఉంచింది. 

 ప్రస్తుతం భారత్ తన వంటనూనె అవసరాల కోసం పామ్ ఆయిల్ ని మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటుండగా సోయా ఆయిల్ ను బ్రెజిల్, అజ్రెంటీనాల నుంచి దిగుతి చేసుకుంటోంది. అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా, హంగేరీ నుంచి దిగుంతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies