Type Here to Get Search Results !

Sports Ad

ఒక్క ఫైనల్ కూడా ఓడిపోలేదు RCB అదృష్టమంతా అతని దగ్గరే ఉంది RCB Has Not Lost A Single Final And All Its Luck Lies With Him

ఒక్క ఫైనల్ కూడా ఓడిపోలేదు RCB అదృష్టమంతా అతని దగ్గరే ఉంది

Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆపధబాంధవుడయ్యాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లో భాగంగా క్వాలిఫయర్ 1 లో పంజాబ్ కింగ్స్ పై మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఓవరాల్ గా 3.3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి జోష్ ఇంగ్లిష్, శ్రేయాస్ అయ్యర్, అజమాతుల్లా ఓమార్జాయి వికెట్లు తీసుకున్నాడు.ప్లే ఆఫ్స్ కు ముందు గాయామ్ కారణంగా ఈ కంగారు బౌలర్ కొన్ని మ్యాచ్ లు ఆడలేదు. దీంతో ఆర్సీబీ బౌలింగ్ బలహీనంగా మారింది. హాజిల్‌వుడ్ లేని మ్యాచ్ ల్లో ఆర్సీబీ 200 పైగా పరుగులు సమర్పించుకుంది. 

 హేజల్ వుడ్ రాకతో ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్ ఒక్కసారిగా బలంగా మారింది. అతను ఇచ్చిన శుభారంభాలతో మిగిలిన బౌలర్లు చెలరేగి మిగిలిన పని పూర్తి చేస్తున్నారు. కేవలం పెర్ఫామెన్స్ తోనే కాదు వ్యక్తిగతంగా ఈ ఆసీస్ బౌలర్ కు ఘనమైన రికార్డ్ ఉంది. అదేంటో కాదు హేజల్ వుడ్ ఫైనల్ ఆడిన ఏ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఈ ఆసీస్ పేసర్ ఆరు ఫైనల్స్ లో ఆడితే అన్ని విజయాలే. 2012  ఛాంపియన్స్ లీగ్ 2015 వన్డే వరల్డ్ కప్ 2020 బిగ్ బాష్ లీగ్.. 2021 ఐపీఎల్ టైటిల్ (చెన్నై సూపర్ కింగ్స్ తరపున) 2021 టీ20 వరల్డ్ కప్ 2023 వన్డే వరల్డ్ కప్ ఈ ఆరు ఫైనల్స్ లోనూ హేజల్ వుడ్ ఆడిన జట్టు టైటిల్ గెలవడం విశేషం. 

 ఏ జట్టు తరపున ఆడినా ఇప్పటివరకు హేజల్ వుడ్ ఫైనల్స్ లో ఓడిపోలేదు. దీంతో అతను ఆర్సీబీకి ఈసారి లక్కీ చార్మ్ గా మారిపోయాడు. పంజాబ్ కింగ్స్ పై గెలిచి ఐపీఎల్ ఫైనల్ కు చేరిన బెంగళూరు ఫైనల్లో గెలిస్తే తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది. ఒకవేళ ఆర్సీబీ ట్రోఫీ గెలిస్తే హేజల్ వుడ్ రికార్డ్ 7-0గా ఉంటుంది. ఇప్పటికే ఈ కంగారు పేసర్ కు ఇండియాలో అమాంతం పెరిగిపోయింది. ఈ సీజన్ లో బౌలర్ గా అదరగొడుతున్న హేజల్ వుడ్ ఫైనల్లోనూ ఇదే ఫామ్ ను కొనసాగించి బెంగళూరుకు టైటిల్ అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies