Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్‌‎లో భారీ అగ్నిప్రమాదం ఐదంతస్తుల భవనంలో పేలిన ఏసీ కంప్రెషర్లు Major Fire In Hyderabad, AC Compressors Explode In Five Storey Building

హైదరాబాద్‌‎లో భారీ అగ్నిప్రమాదం ఐదంతస్తుల భవనంలో పేలిన ఏసీ కంప్రెషర్లు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్‎లో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది మరణించిన విషాదం మరువకముందే తాజాగా నగరంలో మరో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. శుక్రవారం (మే 30) సాయంత్రం మధురానగర్‌లోని ఓ రెసిడెన్షియల్‌ అపార్ట్మెంట్‎లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. G+5 బిల్డింగ్‎లోని సెకండ్ ఫ్లోర్‎లో ఒక్కసారిగా ఏసీ కంప్రెషర్లు పేలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. 

 ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎగసిపడుతుండటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మిగితా ఫ్లోర్లలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies