Type Here to Get Search Results !

Sports Ad

ఇవాళ (మే 29) ఈ జిల్లాల్లో భారీ వర్షాలు రేపట్నుంచి తగ్గే ఛాన్స్ ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే Today (May 29) There Is A Chance Of Heavy Rain In These Districts, Which Will Decrease From Tomorrow. What Will The Temperatures Be Like

ఇవాళ (మే 29) ఈ జిల్లాల్లో భారీ వర్షాలు రేపట్నుంచి తగ్గే ఛాన్స్ ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వానాకాలానికి ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (మే 28) తెలంగాణ మొత్తం వ్యాపించిన నైరుతి రుతుపవనాలు ఛత్తీస్ గఢ్, ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాల్లోకి వ్యాపించాయి. దీంతో వచ్చే మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

 అయితే ఇవాళ(మే 29) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. నిన్న (బుధవారం) 17 డిగ్రీల అక్షాంశ ప్రాంతంలో కొనసాగిన గాలి విచ్చిన్నత ఈరోజు బలహీన పడిందని తెలిపారు. దీంతో ఈ ఒక్కరోజు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని, తూర్పు దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు.
ఇవాళ (గురువారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి , నారాయణపేట, జోగులంబ గద్వాల్  జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

 ఇక ఇవాళ హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. రేపుటి నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో  కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 

 నైతురు రుతుపవనాల రాకతో చల్లబడ్డ తెలంగాణలో రాగల మూడు రోజులలో  గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఈ వాతావరణ కేంద్రం తెలిపింది.

 ఈరోజు, రేపు  ఎల్లుండి  రాష్ట్రంలోని  కొన్ని జిల్లాలలో  గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెదర్ అప్ డేట్స్ రిలీజ్ చేసింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies