ఎక్మయి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం
* బోర్న్ టూ సర్వ్ ఆధ్వర్యంలో జరిగింది
* స్పాన్సర్ చేసిన వాళ్ళు సండ్రస సుకుమార్
* స్పాన్సర్ చేసిన వాళ్ళు సండ్రస సుకుమార్
బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : బషీరాబాద్ మండలం ఎక్మయి గ్రామం లో బోర్న్ టూ సర్వ్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.శ్రీ సాయి కంటి వైదశాల డా.మురళి మోహన్ గారిచే ఉచితంగా కంటి పరీక్షలు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సండ్రస సుకుమార్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. కొంత మంది కంటి పరీక్షలు చేసుకున్నవారు మాట్లాడుతూ చాలా బాగా చూసారని వాళ్ళు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ యొక్క కార్యామలలో బోర్న్ టూ సర్వ్ మెంబెర్స్ అనిల్,మణి రత్నం,అనిల్ కుమార్,డాక్టర్స్ మురళి మోహన్,అజయ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, బషీరాబాద్ మండల మాల మహానాడు అధ్యక్షులు విజయ్ కుమార్, అంబేద్కర్ సంఘ యువకులు కాశినాథ్, కమల్ కుమార్, శామప్ప, రమేష్, గ్రామస్తులు పెద్దలు పాల్కొన్నారు.





