Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ రైజింగ్ 2047 మనల్ని నడిపించే మంత్రం సీఎం రేవంత్ Telangana Rising 2047 Is The Mantra That Drives Us: CM Revanth

తెలంగాణ రైజింగ్ 2047 మనల్ని నడిపించే మంత్రం సీఎం రేవంత్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో మాట్లాడిన రేవంత్  2047 నాటికి భారత దేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతుందన్నారు. దేశాన్ని 30 ట్రిలియన్ ఎకానమీ తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన  నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 

 అందుకే తెలంగాణ రైజింగ్-2047/ భవిష్యత్  ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్  ఎకానమీగా తీర్చిద్దాలని నిర్ణయించాం. తెలంగాణ రైజింగ్ మనల్ని నడిపించే మంత్రం. 2047 నాటికి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే  తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పారదర్శక పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా ప్రభుత్వానికి మీరంతా అందగా ఉంటారని ఆశిస్తున్నా. 

 ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. తెలంగాణ జరూర్ ఆనా అంటూ వందకు పైగా దేశాల నుంచి 72వ మిస్ S65 పోటీలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు.  వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచ నలుదిశలా చాటారు. 

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో “భారత్ సమ్మిట్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ను అంతర్జాతీయ వేదికగా మార్చాం. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు.

 అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధంచేశాం. 30వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. ఏఐ సిటీ,స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేసాం.ఇందుకోసం ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం.రాష్ట్రంలో మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను
పెంచుకునెందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

 ఇప్పటికే మామునూరువిమానావయం పునరుద్ధరణకు అన్ని అనుమతులు సాధించాం. హైదరాబాద్ నగర అభీవృద్ధి లక్ష్యంగా దాదాపు 18 వేల కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి బెటర్ రింగ్ St వరకు రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నాం. రీజనల్ రైల్ తో పాటు మెట్రో రైల్ విస్తరణ చేపడుతున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూ.24 వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం అని రేవంత్ అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies