ఎక్మయి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం
బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : బషీరాబాద్ మండలం ఎక్మయి గ్రామంలో తేదీ 28/05/25 రోజున ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 100 మందికి ఉచిత చికిత్స చేశారు.64 మందికి కంటి అద్దాలు వచాయి. ఈరోజు కంటి అద్దాలు పంపిణి కార్యక్రమంలో భారత రత్న డా.B.R. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ. సండ్రస సుకుమార్ DyEE గారి సహాయంతో ఎక్మయి గ్రామంలో కంటి అద్దాలు పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మున్ని ప్రకాష్ రెడ్డి, దుశాంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి రాజు, హౌసుల సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి, బైకడి శ్రీనివాస్, రాజు పటేల్,ఎస్సి జిల్లా అధ్యక్షులు శంకరప్పా,మండల అధ్యక్షులు మాల మహానాడు విజయ్ కుమార్, గ్రామ యువకులు గంగాధర్, కాశినాధ్,రవీందర్, కమల్ కుమార్, నర్సిములు, సండ్రస నర్సిములు, శన్నప్ప తదితరులు పాల్గొన్నారు.





