90 డిగ్రీల మలుపుతో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇలాంటి రోడ్డు నెవ్వెర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇంజినీరింగ్ అద్భుతం అంటే ఇదే మన దేశంలోని ఇంజినీర్ల తెలివికి ఈ కాలం ఇంజినీర్ల నిర్మాణాలకు ఈ ఫ్లై ఓవర్ ఓ నిదర్శనం. ఆల్ మోస్ట్ దాదాపుగా ప్రపంచంలో ఎక్కడా ఎక్కడా ఇలాంటి ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగి ఉండకపోవచ్చు అనే వాదన సోషల్ మీడియాలో వ్యక్తం అవుతుంది. అవునా ఇంతకీ అంత అద్భుతమైన చారిత్రాత్మకమైన రైల్వేఓవర్ బ్రిడ్జి ఎక్కడ కట్టారు దాని విశేషాలు ఏంటో తెలుసుకుందామా.
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ సిటీ. ఐష్ బాగ్ అనే ప్రాంతం ఉంది. రద్దీ ఏరియా. జనం అటూ ఇటూ తిరగటానికి మధ్యలో రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే గేటు దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పదేళ్ల క్రితం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు అధికారులు. పదేళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి. దీనిపై భోపాల్ జనంలో తీవ్రమైన నిరసనలు, అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ విషయాన్ని గమనించి మంత్రి విశ్వాస్ సారంగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి డెడ్ లైన్ పెట్టి ఆలోపు పనులు పూర్తికాకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు అత్యంత వేగంగా మొదలయ్యాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేశారు అధికారులు. ప్రారంభానికి సిద్ధం అని ప్రకటించిన తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జి ఫొటోలు బయటకు వచ్చాయి. అందరూ షాక్ మైండ్ బ్లోయింగ్. 90 డిగ్రీల మలుపుతో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. సహజంగా ఏ ఫ్లై ఓవర్ అయినా బ్రిడ్జి అయినా మలుపును 30 డిగ్రీలకు ఉంటుందని ప్రస్తుతం భోపాల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి 90 డిగ్రీల మలుపు ఉందని అంటే వాహనాలు ఆగి వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు నెటిజన్లు.
90 డిగ్రీల మలుపు అంటే వాహనాలు ఆగి వెళ్లాలి. దీని వల్ల ఉపయోగం ఏంటీ అంటున్నారు వాహనదారులు. అంతేకాదు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా చాలా ఉందని హెచ్చరిస్తున్నారు స్థానికులు. రాత్రి సమయాల్లో స్పీడ్ గా వచ్చే వాహనాలు ఎగిరి పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 90 డిగ్రీలు అంటే మనం రోడ్డపై వెళ్లే సమయంలో జంక్షన్ దగ్గర ఆగి టర్న్ తీసుకున్నట్లే అలాంటి 90 డిగ్రీల మలుపును రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఏర్పాటు చేయటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.





