Type Here to Get Search Results !

Sports Ad

నవంబర్14న అగ్రికల్చర్ లోన్ ప్రోగ్రాం Agriculture Loan Program on November 14th

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : నవంబర్​14న ‘మెగా వ్యవసాయ రుణాల’పై (అగ్రికల్చర్ లోన్  ప్రోగ్రాం ) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్‌‌‌‌ హెడ్ ఎంవీఎస్ ప్రపాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలోని అన్ని శాఖల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ అవగాహన కార్యక్రమంలో అర్హులైన రైతులు, వ్యవసాయాధారిత వ్యాపారులకు వివిధ రుణాలకి సంబంధించిన పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి తక్షణమే రుణ మంజూరు పత్రాలు జారీ చేస్తామన్నారు.

 రైతులు, వ్యవసాయాధారిత వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  మరిన్ని వివరాల కోసం  మీ  సమీప శాఖను సంప్రదించడంతో పాటు  టోల్ ఫ్రీ నంబర్ 1800 3030  కు కాల్ చేయవచ్చన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies