Type Here to Get Search Results !

Sports Ad

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్: మొత్తం 250 పోస్టులు జీతం నెలకు 44వేలు అప్లయ్ చేసుకోండి Government Job Notification: Total 250 posts, salary 44 thousand per month, apply

భారత్ ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ సెక్రటేరియట్ (Cabinet Secretariat)లో 250 ఖాళీ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో కాకుండా పోస్ట్ ద్వారా (ఆఫ్‌లైన్‌లో) పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 15 నుండి 

ఖాళీ పోస్టుల వివరాలు (సబ్జెక్టుల వారీగా): కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 124, డేటా సైన్స్ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): 10, ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్: 95, సివిల్ ఇంజనీరింగ్: 2, మెకానికల్ ఇంజనీరింగ్: 2, భౌతిక శాస్త్రం (Physics): 6, రసాయన శాస్త్రం (Chemistry): 4, గణితం (Maths): 2, గణాంకాలు (Statistics): 2, భూగర్భ శాస్త్రం (Geology): 3, మొత్తం: 250. 

విద్యార్హత: BE/BTech (ఇంజనీరింగ్) లేదా MSc (సైన్స్ మాస్టర్స్ డిగ్రీ) చదివి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారికి GATE 2023 / 2024 / 2025 స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం: GATE స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.

వయోపరిమితి: గరిష్టంగా 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), ఓబీసీ (OBC), ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం : ఎంపికైన వారికి నెలకు రూ. 44,900 నుండి రూ. 1,42,400 వరకు జీతం ఉంటుంది. దీనికి అదనంగా డీఏ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA), మెడికల్, పెన్షన్ సహా ఇతర ప్రభుత్వ సదుపాయాలు కూడా ఉంటాయి.

ఆఫ్‌లైన్లో  ఎలా దరఖాస్తు చేసుకోవాలి: 
ముందుగా అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* తరువాత ఫామ్‌ను ప్రింటవుట్ తీసుకోండి.

* ఫామ్‌లో అడిగిన సమాచారాన్ని అంటే మీ పేరు, వివరాలు వంటివి జాగ్రత్తగా నింపాలి.

అవసరమైన డాక్యుమెంట్ల కాపీలను (xerox) అటాచ్ చేయండి.

ఇప్పుడు అన్నీ సరిగ్గా నింపారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

చివరికి దరఖాస్తు ఫామ్‌, పేపర్స్ కింద ఇచ్చిన అడ్రసుకు పోస్ట్ ద్వారా పంపాలి. 

దరఖాస్తు పంపాల్సిన చిరునామా (Address): పోస్ట్ బ్యాగ్ నం. - 001, లోధి రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ - 110003

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies