తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : అమెరికా ఆర్థిక వ్యవస్థ షట్ డౌన్ నుంచి తేరుకోవటం నుంచి వేగంగా ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపుతోంది. దీంతో బంగారం, వెండి వంటి లోహాలపై రేట్ల ఒత్తిడి తగ్గుతోందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో కార్తీకమాసంలో ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తగ్గిన రిటైల్ రేట్లను గమనించటం ముందుగా మంచిది.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే నవంబర్ 17తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 18న రూ.1740 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.174 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 18న):
హైదరాదాబాదులో రూ.12వేల 366
కరీంనగర్ లో రూ.12వేల 366
ఖమ్మంలో రూ.12వేల 366
నిజామాబాద్ లో రూ.12వేల 366
విజయవాడలో రూ.12వేల 366
కడపలో రూ.12వేల 366
విశాఖలో రూ.12వేల 366
నెల్లూరు రూ.12వేల 366
తిరుపతిలో రూ.12వేల 366
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు నవంబర్ 17తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 18న 10 గ్రాములకు రూ.1600 తగ్గుదలను చూసింది. దీంతో మంగళవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 18న):
హైదరాదాబాదులో రూ.11వేల 335
కరీంనగర్ లో రూ.11వేల 335
ఖమ్మంలో రూ.11వేల 335
నిజామాబాద్ లో రూ.11వేల 335
విజయవాడలో రూ.11వేల 335
కడపలో రూ.11వేల 335
విశాఖలో రూ.11వేల 335
నెల్లూరు రూ.11వేల 335
తిరుపతిలో రూ.11వేల 335
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తన రేట్ల పతనాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ 18న కేజీకి వెండి నవంబర్ 17తో పోల్చితే రూ.5వేలు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 70వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.170 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.





