Type Here to Get Search Results !

Sports Ad

అందె శ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy who carried the Ande Sri Pade


తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : సహజ కవి అందె శ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఘట్ కేసర్ లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అందె శ్రీ పాడె మోశారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అందె శ్రీ అమర్ రహే అంటూ నినదించారు సీఎం రేవంత్ రెడ్డి.

 అంతకు ముందు  అందె శ్రీ అంతిమ యాత్ర తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్ కేసర్ లోని ఎన్ఎఫ్ సీ నగర్ కు వరకు  జరిగింది. అభిమానులు, ప్రముఖులు ,కళాకారులు కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు.  500 మంది కళాకారులు ఆటపాటలతో అందె శ్రీ అంతిమ యాత్రలోపాల్గొన్నారు. యాత్ర సాగుతున్నంతసేపు కళాకారులు ఆడిపాడారు. అమర్ రహే అందె శ్రీ అంటూ నినాదాలు చేశారు. 

 ఈ అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కళాకారుడిగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies