Type Here to Get Search Results !

Sports Ad

జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్స్ Jubilee Hills Bipole Live Updates


తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : జూబ్లీహిల్స్‌‌ బైపోల్‌ పోలింగ్ కొనసాగుతోంది.  నవంబర్ 11న  మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌‌ జరగనుంది.  మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందకు ఓటర్లు  క్యూ కడుతున్నారు. ​ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

* ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు.

* జూబ్లీహిల్స్  పోలింగ్ మందకొండిగా సాగుతోంది. కొందరు వృద్ధులు సైతం వీల్ చైర్ లో ఓటు వేయడానికి వస్తున్నారు. కానీ యువకులు, పలువురు సెలబ్రిటీలు ఓటు వేయడానికి రావడం లేదు

* యూసఫ్ గూడలో ఓటు వేసిన నటుడు తనికెళ్ల భరణి

* ఉదయం 9 గంటల వరకు 10 శాతం ఓటింగ్ నమోదు. మొదటి రెండు గంటల్లో ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తున్న  ఓటర్లు.

* బోరబండ 328 పోలింగ్ స్టేషన్ లో మొరాయించిన EVM. మరో మెషీన్ పెట్టిన అధికారులు. కొద్దిసేపు అంతరాయం తర్వాత తిరిగి ఓటింగ్ ప్రారంభం.

* షేక్ పేట్ డివిజన్ వలిస్కూల్ బూత్ నెంబర్ 31 లో అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* బోరబండలో పోలింగ్ స్టేషన్ల దగ్గర కర పత్రాలతో బీఆర్ఎస్ నేతల ప్రచారం చేస్తున్నారంటూ అధికారులకు కంప్లయింట్ చేసిన కాంగ్రెస్ నాయకులు. నిబంధనలకు విరుద్ధంగా KCR ఫోటోలతో ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. ఓ పత్రికలో వచ్చిన యాడ్ చూపిస్తూ కార్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారని ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ నేతలు కంప్లయింట్.

* బోరబండ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని 332 బూతులో ఏజెంట్లకు సరైన సదుపాయాలు కల్పించట్లేదంటూ బి ఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల అధికారులను నిలదీశారు.

* రెహమత్ డివిజన్ లో తిరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అడ్డుకున్న డీసీపీ శ్రీనివాస్. ఇతరులు నియోజకవర్గంలో తిరగకూడదని వెంటనే వెళ్లిపోవాలని సూచించిన పోలీసులు

మధుర నగర్ లో ఓటేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మధుర నగర్ లోని శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్ లోని పోలింగ్ బూత్ 132 లో హైడ్రా కమిషనర్  రంగనాధ్ ఓటేశారు. ఆయన  కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ప్రతి ఒక్కరు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు .58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంది.

* యూసఫ్ గూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన  పోలింగ్ బూత్ లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్

* మధుర నగర్ లోని శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్ లోని పోలింగ్ బూత్ 132 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్

* జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ఉదయం 9 గంటలకు వరకు 9.2 శాతం నమోదు

* శ్రీనగర్ కాలనీ నాగర్జున నగర్, నాగార్జున కమ్యూనిటీ హాల్ లో పోలింగ్ బూత్ నెంబరు 301 లో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

* బోరబండలోని పోలింగ్‌ బూత్‌లు పరిశీలించిన ఆర్‌వీ కర్ణన్‌

* యూసఫ్ గూడలో పోలింగ్ కేంద్రం దగ్గర పోలింగ్ సరళిని పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

* రహమత్ నగర్ డివిజన్ 165 పోలింగ్ స్టేషన్ లో మొరాయించడంతో  కొత్త EVM తెచ్చి పెట్టారు అధికారులు. పోలింగ్ కొనసాగుతోంది.

* షేక్ పేట డివిజన్ లోని  కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28, 29, 30 లో ఓటింగ్ సరళిని పరిశీలించిన బిజెపి అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి.

* షేక్ పేట డివిజన్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న డైరెక్టర్  SS రాజమౌళి

* ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 
* షేక్ పేట డివిజన్ వివేకానంద కాలనీ బూత్ నెంబర్ 31, 32, 33 వద్ద పోలీసులతో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ నాయకుడు  వాగ్వాదానికి దిగారు. నాలుగు బూతుల్లో పోలింగ్ సెంటర్ వద్ద టేబుల్స్ ఎక్కువగా ఏర్పాటు చేశారని వాగ్వాదానికి దిగడంతో  తొలగించారు పోలీసులు.

ఎన్నికల్లో మొదటిసారి అమల్లోకి వచ్చిన వచ్చిన అంశాలు...
* మొదటిసారిగా ఈవీఎం లో అభ్యర్థుల కలర్ ఫోటో

* మొదటిసారి డ్రోన్లతో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్న అధికారులు 

* ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ డిపాజిట్ సెంటర్ ఏర్పాటు

* ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఏర్పాటు

* మొదటిసారి పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచిన అధికారులు

జూబ్లీహిల్స్​పోలింగ్​కు భద్రత పెంపు...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్​లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్​కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్​బలగాలను మోహరించగా 1,761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచే అవకాశాలున్నాయి. యూసుఫ్‌‌‌‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, షేక్​పేట, ఫిల్మ్‌‌‌‌నగర్ తదితర ప్రాంతాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్ ఏరియాల్లోని లాడ్జీల్లో గెస్ట్ రిజిస్టర్లను చెక్​చేస్తున్నారు.

 ఈ ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నాయి.  కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముకోగా, బీఆర్‌‌ఎస్ సెంటిమెంట్‌‌పై ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ మోదీ ప్రభ, హిందుత్వ అజెండానే విశ్వసిస్తున్నది.  కాంగ్రెస్​ రెండేండ్ల పాలన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్లే 3 ప్రధానపార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies