Type Here to Get Search Results !

Sports Ad

శుక్రవారం మళ్లీ తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్ తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రేట్లివే Gold and silver prices fell again on Friday, rates in Telugu states reduced

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : మెటల్ స్టాక్స్ కుప్పకూలుతున్న వేళ విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు కూడా దానికి అనుగుణంగా తగ్గుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరిగి షాపింగ్ షురూ చేస్తున్నారు. ముఖ్యంగా మళ్లీ భవిష్యత్తులో ఊహలకు అందని స్థాయిలకు గోల్డ్ అండ్ సిల్వర్ చేరుకోవచ్చనే అంచనాల దృష్ట్యా ముందుగానే కొనుగోలుకు వెళుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో తాజా రేట్లను గమనించండి. 

 ఫిబ్రవరి 6న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో ఫిబ్రవరి 5 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.207 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.15వేల 235గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 965గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.

 ఇక వెండి రేట్లు వరుస పతనాన్ని అలాగే కొనసాగిస్తూ కొనుగోలుదారులకు భారీ ఊరటను అందిస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొన్ని రోజుల కిందటి వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. కానీ శుక్రవారం ఫిబ్రవరి 6, 2025న వెండి రేటు కేజీకి రూ.20వేలు తగ్గింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.20వేలు తగ్గి రూ.2లక్షల 80వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.280 వద్ద ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies