Type Here to Get Search Results !

Sports Ad

కొత్తవారం పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు హైదరాబాదులో రేట్లు ఎలా ఉన్నాయంటే Gold and silver rates increased in the new week. How are the rates in Hyderabad

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు భారీగా పెరగనప్పటికీ ఒకరోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు దీనికి కారణం అయినప్పటికీ రిటైలర్లు మాత్రం రేట్లు మరింతగా పెరగకమునుపే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తమ షాపింగ్ నిర్ణయం తీసుకోవటానికి ముందుగా తమ ప్రాంతంలోని రేట్లను పరిశీలించటం మంచిది. 

 ఫిబ్రవరి 9న బంగారం రేట్లు కొద్దిగా పెరిగాయి. దీంతో ఫిబ్రవరి 8 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.224 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా పెరిగి రూ.15వేల 884గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 560గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.

 అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొన్ని రోజుల కిందటి వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఫిబ్రవరి 9, 2025న వెండి రేటు కేజీకి రూ.15వేలు పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.15 వేలు పెరిగి రూ.3లక్షలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.300 వద్ద ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies