Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం బంద్ Municipal election campaigning halted in Telangana

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. సోమవారం సాయంత్రం (ఫిబ్రవరి 9, 2026) 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్దం అమల్లోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల పరిధిలో అన్ని రకాల ప్రచారాలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ర్యాలీలు, సభలు, ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదని ఈసీ స్పష్టం చేసింది. 

 అంతేకాదు టీవీ, సినిమా, మ్యూజిక్ షోల ద్వారా కూడా ప్రచారం చేయకూడదని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై కూడా ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని ఈసీ హెచ్చరించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలు పాటించాలని ఆదేశించింది.

* తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం బంద్
* 48 గంటల పాటు అమల్లో సైలెంట్ పీరియడ్‌
* ఫిబ్రవరి 11న ఎన్నికలు, 13న ఫలితాలు
* తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు
* 2 వేల 996 వార్డులకు 8 వేల 203 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
* ఎన్నికల బరిలో 12 వేల 993 మంది అభ్యర్థులు
* ఓటు హక్కు వినియోగించుకోనున్న 52 లక్షల 43 వేల మంది ఓటర్లు
* ఎన్నికల నిర్వహణకు భద్రత కట్టుదిట్టం.. పాతిక వేల మంది పోలీసులతో బందోబస్తు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies