Type Here to Get Search Results !

Sports Ad

బెంగళూరులో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ ఆర్సీబీ హోంగ్రౌండ్లోనే ప్లేఆఫ్స్, ఫైనల్ IPL opening ceremony in Bengaluru, playoffs and final at RCB's home ground

క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడే టీ20 లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ ప్రారంభ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, ఐపీఎల్ 2026 ప్రారంభోత్సవ వేడుక బెంగళూరులోనే జరగనుంది. ముఖ్యంగా, ఈ సీజన్ ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియంలోనే నిర్వహించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తెలిపింది.  దీంతో టోర్నమెంట్ లో కీలక మ్యాచులు మొత్తం బెంగళూరులోనే కొనసాగనున్నాయి. ఐపీఎల్ ట్రోఫీ కోసం జరిగే కీలక మ్యాచ్ లకు ఈ వేదిక సాక్ష్యంగా నిలవనుంది.

 బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడంతో కర్ణాటక వ్యాప్తంగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు నుంచే నగరంలో క్రికెట్ సందడి మొదలైంది. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ హోం మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనుంది. లీగ్ దశలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఇక్కడ నిర్వహించబడనున్నాయి. భారీ స్కోర్లు, ఉత్కంఠ రేపే మ్యాచ్‌లకు ప్రసిద్ధి చెందిన ఈ వేదిక మళ్లీ ఆర్సీబీకి అదృష్టంగా మారుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 సొంత ప్రేక్షకుల సపోర్టుతో అద్భుతమైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో ఆర్సీబీ టీమ్ రెడీ అవుతుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) రెండు లీగ్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌ వేదికగా కూడా ఆడనుంది. దీంతో మధ్య భారతదేశానికి చెందిన అభిమానులు కూడా తమ ఇష్టమైన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనుంది. కాగా ఐపీఎల్ 2026లో బెంగళూరులో నిర్వహిస్తుండటంతో అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రికెట్ అనుభూతిని అందించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies