Type Here to Get Search Results !

Sports Ad

రోజూ రెండు లవంగాలు నమిలితే ఎన్ని బెనిఫిట్సో తెలిస్తే ఆశ్చర్యపోతారు You'd be surprised to know how many benefits there are if you chew two cloves daily.

ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : ప్రకృతి అందించిన కొన్ని ఆహార పదార్థాలు, మూలికలను సరిగ్గా వాడుకుంటే ఆరోగ్యం మనచేతుల్లోనే ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు. అది నిజం. అందులో మనకు దొరికే సుగంధ ద్రవ్యాలకు ఉన్న పవర్ వేరు. అందుకే కదా పోర్చుగీస్, డచ్, బ్రిటిష్  ఎందరో వలసవాదులు ఇండియాకు క్యూ కట్టారు. అలాంటి స్పెసెస్ లో ముఖ్యమైన లవంగాలను రోజూ రెండు నోట్లో వేసుకుంటే కలిగే మేలు గురించి తెలుసుకుందాం.

 లవంగాలు లేని ఇల్లు, కిచెన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి క్లోవ్స్ ను రోజూ రెండు నమిలితే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. నేచురల్ డైజెషన్ ను ప్రమోట్ చేస్తుంంది. తిన్న తర్వాత లేదా ప్రతి ఉదయం లవంగాలు నమలటం ద్వారా గ్యాస్, ఎసిడిటీ, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రోగనిరోధక శక్తి:
లవంగాలు యాంటీఆక్సిడెంట్స్ కలిగిఉంటాయి. ఇవి తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే జ్వరాలు రాకుండా కాపాడుతుంది. యాంటీ  బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) పెంచుతుంది. 

నోటిని శుభ్రంగా ఉంచడంలో....
లవంగంలో ఉండే యుజినాల్ అనే పదార్థం పంటి నొప్పులనుంచి కాపాడుతుంది. అంతే కాకుండా దుర్వాసన రాకుండా నోటిని ఫ్రెష్ గా ఉంచుతుంది. లవంగాలు నమలటం వలన దుర్వాసనను నివారించడమే కాకుండా చిగుర్లను బలంగా తయారు చేస్తాయి. 

వెయిట్ మేనేజ్మెంట్:
వెయిట్ మేనేజ్ చేయడంలో లవంగాలు తోడ్పడతాయి. శరీరంలో జీవక్రియను పెంచి ఆకలిని కూడా కంట్రోల్ ఉంచుంతుంది. దీంతో మంచి డైజెషన్ ఉండటం వలన బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. 

షుగర్ కంట్రోల్:
రోజూ కొన్ని లవంగాలు నమలటం వలన ప్రీబయాటిక్ స్టేజీలో ఉన్న వారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. మంచి ఆహారంతో పాటు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. 

ఈ జాగ్రత్తలు అవసరం:
ఇన్ని లాభాలు ఉన్నాయని మరీ ఎక్కువగా తీసుకున్నా ఇబ్బందే అంటున్నారు వైద్యులు. రోజుకు ఒకటి లేదా రెండు తీసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. గర్భవతులు, లేదా మెడిసిన్ వాడుతున్న వారు డాక్టర్ సలహా తీసుకుని వాడుకోగలరు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies