Type Here to Get Search Results !

Sports Ad

తాండూరులో లవ్ ట్రాప్ బాలికను హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లే ప్లాన్ యువకుడు అరెస్ట్ Youth arrested for planning to take love trap girl from Hyderabad to Delhi in Tandur

తాండూరు భారత్ ప్రతినిధి : ప్రేమ పేరుతో బాలికను ట్రాప్​ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన ఆదీమ్(28) పనిమీద తాండూరుకు వచ్చి ఆరు నెలలుగా రైల్వే స్టేషన్ సమీపంలోని ఢిల్లీ సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. అదే కాలనీలో అద్దెకు ఉంటున్నాడు.

 ఓ 16 ఏండ్ల బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. శనివారం ఉదయం బాలికను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేశాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తాండూరు పోలీసులను ఆశ్రయించారు.

 పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి నిందితుడు ఆదీమ్‌‌‌‌‌‌‌‌తో పాటు బాలికను అదుపులోకి తీసుకుని తాండూరు పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies