Type Here to Get Search Results !

Sports Ad

TGPSC నోటిఫికేషన్ విడుదల: భారీగా లెక్చరర్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే! TGPSC Notification Released: Large Number of Lecturer Posts – Here Are the Full Details!

భారత్ ప్రతినిధి : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​లో సీనియర్ లెక్చరర్ (డైట్), లెక్చరర్ (డైట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ  జూన్ 24 నుంచి ప్రారంభం కానుంది. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 

మొత్తం ఖాళీలు: 86. 

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ లెక్చరర్ – డైట్ 23, లెక్చరర్– డైట్ 63. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి  నిర్దేశించిన సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఎన్‌‌సీటీఈ  గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎం.ఈడీ  పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి. లాంగ్వేజ్, సైన్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు బీఈడీలో టీచింగ్ మెథడాలజీ చదివి ఉండటం తప్పనిసరిగా పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి:  18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు  5 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్​మన్, ఎన్​సీసీ ఇన్​స్ట్రక్టర్లకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 24. 

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, బీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.500.  

ఎగ్జామినేషన్ ఫీజు: రూ. 120.

లాస్ట్ డేట్: జులై 29. 

ఎగ్జామినేషన్ తేదీ: 2026, నవంబర్.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ tgpsc.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్ (పోస్ట్ కోడ్ 1 నుంచి 18)
ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్​లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–Iలో జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. పేపర్– -II పార్ట్–Aలో సంబంధిత సబ్జెక్టు–I: ఎడ్యుకేషన్ థియరీ & ప్రాక్టీస్ నుంచి 75 ప్రశ్నలు 150 మార్కులకు,  పేపర్–- -IIలో పార్ట్-–-Bలో సంబంధిత సబ్జెక్టు–-II నుంచి 75 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు.    

ఎగ్జామ్ ప్యాటర్న్ (పోస్ట్ కోడ్ 19)
పేపర్–-Iలో జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. పేపర్-–-IIలో పార్ట్-–Aలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ నుంచి 75 ప్రశ్నలు 150 మార్కులకు,  పేపర్-–-IIలో పార్ట్–-Bలో ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగి నుంచి 75 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies