భారత్ ప్రతినిధి : అలా చెబితే చాలు ఇలా గ్రౌండ్లోకి దిగిపోతారు మనోళ్లు నిన్నటికి నిన్న యూపీఐ నిబంధనలు మారుస్తూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన విధానంతో వ్యాపారులు అప్పుడే తమ విజనరీని బయటకు తీశారు. 2 వేల రూపాయలు దాటితే యూపీఐ చెల్లింపులపై డబ్బులు వసూలు చేసే నిబంధన రావటంతో చాలా మంది వ్యాపారులు పాత విధానానికి మారుతున్నారు.
మరికొందరు అయితే క్యాష్ అయితే 50 రూపాయలు UPI అయితే 51 రూపాయలు అంటూ బాదుడు మొదలుపెట్టేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ విధానం అమల్లోకి వచ్చేది 2026, అక్టోబర్ 15వ తేదీ నుంచే మన వ్యాపారులు మాత్రం ఒక నెల అడ్వాన్స్గా ఉండటం సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది.
యూపీఐ పేమెంట్లపై తాము ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందనే భయంతో వ్యాపారులు ‘క్యాష్ ఓన్లీ’ అనే బోర్డులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేంద్రం చేసిన ప్రకటనతో లిక్విడ్ క్యాష్కు డిమాండ్ పెరిగింది. ప్రజలు ఏటీఎంల దగ్గర క్యూ కడుతున్నారు. ఎందుకైనా మంచిదని అవసరం ఉన్నా లేకపోయినా లిక్విడ్ క్యాష్ను వీలైనంత ఎక్కువగా విత్ డ్రా చేసి తమ దగ్గర ఉంచుకుంటున్నారు. ఏటీఎంల దగ్గర రద్దీ పెరిగింది.





