Type Here to Get Search Results !

Sports Ad

రోజుకు లక్ష కోట్ల రూపాయల UPI లావాదేవీలు : భూమిపైనే ఇది రికార్డ్ UPI transactions worth one lakh crore rupees per day: A record on Earth

భారత్ ప్రతినిధి : డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారత్ మరో అరుదైన మైలురాయిని నమోదు చేసింది. దేశంలో UPI చెల్లింపులు సరికొత్త చరిత్ర సృష్టించాయి. అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టాయి. పండుగ సీజన్ కావడంతో ప్రజల కొనుగోళ్లు విపరీతంగా పెరిగి, డిజిటల్ చెల్లింపులు భారీగా నమోదయ్యాయి.

అక్టోబర్ నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం విలువ రికార్డు స్థాయిలో రూ.31 లక్షల 53వేల కోట్లకు చేరింది. యూపీఐ చరిత్రలో ఈ మార్కు దాటడం ఇదే మొదటిసారి. అంతకుముందు మే 2026లో అత్యధికంగా రూ.29 లక్షల 90వేల కోట్ల విలువైన లావాదేవీలు జరగగా.. ఇప్పుడు ఆ రికార్డు కూడా చెరిగిపోయింది. ఇక సగటున రోజువారీ లావాదేవీల విలువ మొదటిసారిగా రూ.లక్ష కోట్లను దాటేసింది.

MDR ఛార్జీల వాయిదా:
వ్యాపారులకు చేసే డిజిటల్ పేమెంట్స్‌పై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) ఛార్జీలను ప్రవేశపెట్టాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. అయితే దీపావళి పండుగ సీజన్ ముగిసే వరకు ఈ ఛార్జీల అమలును వాయిదా వేశారు. రూ. 2వేల కంటే ఎక్కువ విలువైన మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించాలని సెప్టెంబర్ లో యూపీఐ స్టీరింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఈ ఛార్జీల ద్వారా బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు దాదాపు రూ. 15వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా. అయితే యూపీఐపై రుసుము వ్యాపారులను క్యాష్ మార్కెట్ దిశగా నడిపిస్తుందనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies