ఎస్పీ నారాయణ ను వెంటనే సస్పెండ్ చేయాలి
- తెరాస అధికార పార్టీ నాయకులకు వత్తాస్సు పలుకుతూ
- దళిత,గిరిజన అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేస్తున్నా
- దళిత, ప్రజాసంఘాల డిమాండ్
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో అధికారం పార్టీ ఎమ్మెల్యే కు, నాయకులకు కుమ్మకై పలుకుతూ దళిత,గిరిజన పై దాడులకు, దారుణలకు పాల్పడుతున్నా నిందితులకు వత్తాసు పలుకుతూ అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేసేవిదంగా ఇన్వెస్టిగేషన్ అధికారులను బెదిరిస్తూ, గతంలో ఎస్పీ పై వచ్చిన అవినీతి ఆరోపణ పై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవలని నేడు కెవిపిఎస్ , ఎల్ఎచ్పిఎస్ , బీమ్ ఆర్మీ, వ్యవసాయ కార్మిక సంఘం, జివిఎస్ , అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర డిజిపి , మానవ హక్కుల కమిషన్ కలసి ఎస్పీ పై పిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. మహిపాల్, ఎల్ఎచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు గోవింద్ నాయక్, బీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు అంజి రావణ్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య మాట్లాడుతూ...
దోమ మండలం గ్రామంలో డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకున్న అధికార పార్టీ సర్పంచి అతని అనుచరులను అరెస్టు చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు బయపడి వారిని అరెస్ట్ చేయకుండా వదిలి పెట్టే విదంగా ఆదేశాలు ఇవ్వడం, దాంతో పాటు జిల్లాలో అనేక మంది దళిత, గిరిజన లపై అగ్రకుల పెత్తందార్లు,అధికార పార్టీ నాయకులు దాడులు చేసినప్పుడు వారిపై Sc, St కేసులు పెట్టి కొన్ని లొసుగులను ఉపయోగించుకుని అట్రాసిటీ చట్టాన్ని నిరుగారుస్తున్న వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో అనేక మంది దళిత,గిరిజనులపై దాడులు జరిగిన సందర్భాలలో దాడి చేసిన వారిలో అధిక శాతం అధికార పార్టీకి చెందిన నాయకులు ఉండటం గమనార్హం, ఆ కేసులు కూడా దళిత, గిరిజన, ప్రజా సంఘాలు ఒత్తిడి వల్ల పోలీసులు కేసు నమోదు చేస్తే, ఆ నిండుతులను అరెస్ట్ చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే లకు అంటకా గుతూ కింది స్థాయి పోలీస్ అధికారులను బెదిరించి Sc, St అట్రాసిటీ చట్టాన్ని నిరుగారుస్తూ వికారాబాద్ జిల్లాలో ఎస్సీ,ఎస్టీలకు ద్రోహం చేస్తున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ ఒక్క నిమిషం వికారాబాద్ లో ఉండడానికి వీళ్ళేదాని దళిత, గిరిజన, ప్రజా సంఘలు ప్రభుత్వన్ని డిమాండ్ చేశాయి.ఒక వైపుమో ప్రెండ్లి పోలీస్ అని డీజీపీ ప్రచారం చేస్తుంటే వికారాబాద్ జిల్లాలో మాత్రం బాధితులు న్యాయం కొరకు జిల్లా ఎస్పీ నారాయణ దగ్గరికి పోతే బాధితులను వారికి తోడుగా వెళ్లిన దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు ఎస్పీ నారాయణ హేళన చేసి మాట్లాడుతూ మనోభావాలను దెబ్బతినే వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం..అధికార పార్టీ నాయకుల అండతో అహంకార పూరితంగా ఎస్పీ వ్యవరస్తున్నారు.చట్టాన్ని దిక్కరించి జిల్లాలో నేను ఏమిచేసినా నన్ను అడిగేవారు ఎవరున్నారని అని మన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ తీరు ఉందన్నారు.
ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా ఎస్పీ పై కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
లేకపోతే 2021నవంబర్-16 వికారాబాద్ కలెక్టర్ కార్యక్రమం ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో నర్సిములు,వెంకటయ్య, రమేష్, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Correct answer anna
ReplyDelete