- భారత రాజ్యాంగాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11నెలల 18 రోజులు
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని గణపూర్ గ్రామ పంచాయతీలోని గోఫ్యానాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో భారత రాజ్యాంగం దినోత్సవం జరుపుకోవడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11నెలల 18 రోజులు శ్రమించి రాయడం జరిగింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. మనకు ఓటు హక్కు కూడా అంబేద్కర్ కల్పించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. అంటే ఆర్టికల్ 3 ప్రకారo అని మనం తెలుసుకోవాలి.రాజ్యాంగం ప్రకారం అందరూ అన్ని హక్కులూ పొందుతున్నారు.1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 26,1950 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది . కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యారాలు కడంపల్లి లలితమ్మ, ఉపాధ్యాయులు బోరు కృష్ణయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
Good jai bheem
ReplyDelete