ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
బషీరాబాద్ : వికారాబాద్
జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప
స్వామి ఆలయంలో అఖిల్ బుక్ స్టాల్
యజమాని సంతోష్ కుమార్ పడిపూజ కార్యక్రమం
నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అఖిల్ బుక్ స్టాల్
యజమాని సంతోష్ కుమార్ తెలిపారు. అయ్యప్ప స్వాములు గ్రామస్తులు అధిక సంఖ్యలో
పాల్గొన్నారు. అదేవిధంగా మాలధారణ వేసిన అయ్యప్ప స్వాములకు మరియు గ్రామస్థులకు
అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ
సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు .ప్రతి ఒక్కరు
ఆధ్యాత్మికం చింతన అలవర్చుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు
ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అనంతరం
శబరిమలకు బషీరాబాద్ నుండి పాదయాత్ర చేసుకుంటూ
దర్శనం పూర్తి చేసుకున్నగురుస్వామి సాయిలు గౌడ్ కు శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సంతోష్ కుమార్, వారి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గురుస్వామి
సాయిలు గౌడ్ ,అయ్యప్పస్వామి
భక్తులు విశ్వనాథ్, డాక్టర్ నరసింహ ,
రాము, తదితరులు పాల్గొన్నారు.
Good 🙂 all the best
ReplyDelete