పేదల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
* మత సమరస్యానికి ప్రతీకగా సీఎం కేసీఆర్ గారి పాలన
* పేద ముస్లింలకు రంజాన్ కానుకలు
* కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి
* గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur News : బుధవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ పండుగలను ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష అని గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు.ఈ రోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రంజాన్ కానుకల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు.అనంతరం యాలాల్ మండల్, పెద్దేముల్ మండల్, కోట్ పల్లి మండల్ కి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులని పంపిణీ చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
యాలాల మండలానికి చెందిన ముగ్గురు లబ్దిదారలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.అన్నాసాగర్ గ్రామానికి చెందిన సాయి రెడ్డికి రూ.90 వేల చెక్కును,దేవనూరు గ్రామానికి చెందిన మొగులప్పకు రూ.68 వేల చెక్కును,సంగాయిగుట్ట తాండకు సాలిబాయికి రూ16 వేల చెక్కును అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో లక్షల మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని తెలిపారు.
40 ఏండ్లనుండి ఎవరు చేయలేని పని నేను చేస్తున్నా
తాండూరు టౌన్ 26వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు.40 ఏళ్లుగా లేని అభివృద్ధిని నాలుగేళ్లలోనే చేసి చూపిస్తున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.తాండూరు టౌన్ లోని వార్డు నెంబర్ 19లో రాయల్ గార్డెన్ నుంచి కింగ్ ప్యాలెస్ ఈద్గా ప్రాంతం వరకు రూ.20 లక్షలతో రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డును గత 40 సంవత్సరాలుగా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని .. ఇప్పుడు మహర్ధశ వచ్చిందన్నారు.