తాండూర్ టౌన్ లో ఏంసెట్ కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ
తాండూరు Tandur News : తాండూరు టౌన్ లో సమద్ ఫంక్షన్ హాల్లో ముస్లిం వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. అలాగే విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ కోచింగ్ ద్వారా అందరూ విద్యార్థులు మంచిగా చదువుకొని, ఫ్రీసిటీ సంపాదించాలని ఎమ్మెల్సీ గారు కోరారు, మీకు ముందు ముందు వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయని ఎమ్మెల్సీ గారు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమల్ అక్తర్, బసిత్ బాయ్, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు, కౌన్సిలర్స్ మణపురం రాము, బోయ రవి రాజు, సీనియర్ నాయకులు మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు,సర్పంచ్ మరేపల్లి బాల్వంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లలా, మసూద్, PACS వైస్ చైర్మెన్ అజయ్ ప్రసాద్, ఎంపిటిసి శ్రీధర్, రాష్ట్ర యూత్ కార్యదర్శి బి రఘు, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి, అజీజ్ లలా, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.