పల్లె పల్లెకు కార్యక్రమంలో పైలట్ హైలెట్
బషీరాబాద్ Basheerabad News : పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా బషీరాబాద్ మండలంలోని ఎమ్యెల్యే పైలట్ కి ఘన స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు కార్యకర్తలు.మైల్వార్ తాండలో మరియు మైల్వార్, కంసాన్‌పల్లి,ఎక్మాయి గ్రామంలో ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పర్యటించి, సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.ప్రతి గ్రామానికి రూ.50 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.అర్హులైన మహిళలకు కల్యాణ లక్ష్మి పథకాలు అందజేశారు.దామార్చెడ్ గ్రామంలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం గ్రామాని సందర్శించి రూ.50 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
బషీరాబాద్ మండల కేంద్రంలో గత 19 రోజులు గా ఎక్సప్రెస్ రైళ్లు ఆగలని జయరామ్ చారి అధ్వర్యంలో చేస్తున్న నిరవదిక దీక్షకి సంఘీబవంగ వచ్చిన మన ప్రియతమ నేత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఎంపీ రంజిత్ రెడ్డి గారితో మాట్లాడారు.పల్లె పల్లెకు పైలట్ ప్రోగ్రాం తరువాత ఎంపీ రంజిత్ రెడ్డి గారితో కలిసి రైల్వే GM గారిని కలుద్దాం అని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే ఎంపీ గారితో కలిసి GM నీ కలిసిన తరువాత నిరవదిక దీక్ష ముగిస్తాను అని కమిటీ సభ్యులు తెలిపారు.
ఎంపీ,ఎమ్మెల్యే గారితో GM నీ కలిసి లెటర్ ఇవ్వడం వల్ల అన్నగారు హామీ నెరవేరుతుంది అలాగే మనం దీక్షకి కూడా ఫలితం వస్తుంది అనే ఉద్దేశ్యంతో దీక్ష విరమించలేదు.మాకు అండ దండగా ఉన్న తెరాస సభ్యులకు ముఖ్యంగా రాజు ,రవీందర్ సింగ్ ,రాము నాయక్ బషీరాబాద్ గ్రామ నాయకులు అందరికీ ధన్యవాదాలు మీ సహకారంతో ఈ దీక్షకు ఫలితం వస్తది అని తెలిపారు.రోహిత్ ఆన్న గారి చేత్తో జెండా ఉపి ట్రైన్ అపుధం అని తెలిపారు.అలాగే జై రోహిత్ ఆన్న అని నినాదాలు చేశారు.
ఇట్టి కార్యక్రమంలో బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్, సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, నర్సిరెడ్డి (రాజు పటేల్), మండల (పిఎసిఎస్) చైర్మన్ వెంకట్రాంరెడ్డి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ అనంతయ్య గౌడ్, సర్పంచ్ సీమా సుల్తానా, సర్పంచ్ వెంకటయ్య,సర్పంచ్ నారాయణ,ఎంపిటిసి సేడం రాజు గౌడ్, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.