ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నవాళ్లకు ఓ ప్రకటన ఎంఆర్ఓ
బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం తహశీల్దార్ వెంకట్ స్వామి గారు ప్రజలకు ప్రభుత్వ స్థలాల్లో 2 జూన్ ,2020 నాటికన్నా ముందుగా ఎవరైనా ఇల్లు నిర్మించుకొని ఉన్నట్లయితే వారు 58 మరియు 59 జీవోల ప్రకారంగా వారి స్థలాన్ని రెగ్యులరైజేషన్ చేయడానికి మీ సేవలో దరఖాస్తు చేసుకోగలరు.ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.చివరి తేదీ ఏప్రిల్ 30, 2023 125 గజాలు కన్నా తక్కువగా ఉన్న ఇంటి నిర్మాణానికి కోసమే జీవో నెంబర్ 58 ప్రకారము మరియు 125 గజాల కన్నా ఎక్కువగా ఇంటి నిర్మాణం ఉంటే దాని కోసం జీవో నెంబర్ 59 ప్రకారం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.