బలగం సినిమా మొగులయ్యకు కంటి ఆపరేషన్ చిరంజీవి సహాయం
హైదరాబాద్ Hyderabad : సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద ఆయన సాయం చేస్తుంటాడు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ‘బలగం’ మొగిలయ్యకు సాయం చేసి మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. బలగం సినిమాలో Balagam movie ‘నా తోడుగా నా తోడు ఉండి’అనే పాటతో ఫేమస్ అయిన బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
మొగిలయ్య దీనస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి మెగాస్టార్ ఆయనకు తిరిగి కంటి చూపు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారట.ఈ క్రమంలో బలగం దర్శకుడు వేణుకి ఫోన్ చేసి మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని ఆయనకు కంటి చూపు వచ్చేలా చేద్దామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేణు మొగిలయ్య దృష్టికి తీసుకువెళ్లారట. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ మొగిలయ్య దంపతులను ఇంటర్వ్యూ చేయగా మెగాస్టార్ సాయం విషయం వెలుగులోకి వచ్చింది.
మరోవైపు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. మొగిలయ్య చికిత్సకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు.