బషీరాబాద్ లో ఆర్ఐ భాగ్యలక్ష్మిని సస్పెండ్ చేసిన కలెక్టర్
బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న భాగ్యలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆరి భాగ్యలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి చెక్కు ఇచ్చేందుకు రూ. 15000 లంచం అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుడడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను వెలువరించినట్లు తెలిపారు.ఇదివరకు కూడా చాలా సార్లు నిరుపేదల దగ్గర లంచం ఇస్తేనే పని చేసేదని లేకపోతే సంతకాలు పెట్టేదికాదని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.