నేటితో పూర్తికానున్న ఇంటర్ వాల్యుయేషన్
తెలంగాణ telangana : గత పది రోజుల క్రితం ప్రారంభమైన ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ నేటితో పూర్తికానుంది. ఇంటర్ పరీక్షలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 3 వరకు జరిగాయి.
పది పరీక్షలు ఏప్రిల్ ఆరున ప్రారంభమై నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ పదవ తేదీ నుంచి ప్రారంభమైంది. తిరుత్తణిలోని గెంగుస్వామి నాయుడు మెట్రిక్ పాఠశాల, తిరువళ్లూరులోని డీఆర్‌బీసీసీ, ఆవడిలోని ఎయిడెడ్ పాఠశాల మూడు కేంద్రాల్లో జరిగింది. మొత్తం ఆరు వందల మంది ఉపాద్యాయులు వాల్యుయేషన్‌లో పాల్గొన్నారు.
ఇంటర్ వాల్యుయేషన్ నేటితో ముగియనుండడంతో శుక్రవారం నుంచి విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇలావుండగా పది పరీక్షలు నేటితో ముగియనున్న నేపథ్యంలో 24 నుంచి వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం తిరుత్తణి, తిరువళ్లూరు, ఆవడిలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాల్యుయేషన్ ప్రక్రియ 15 రోజుల పాటు సాగే అవకాశం వుంది.
మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ లో ఆర్ఐ భాగ్యలక్ష్మిని సస్పెండ్ చేసిన కలెక్టర్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేటితో పూర్తికానున్న ఇంటర్ వాల్యుయేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* దేశంలో మళ్లీ కరోనా కలకలం ఇక్కడ క్లిక్ చేయండి