దేశంలో మళ్లీ కరోనా కలకలం
Health : దేశంలో మళ్లీ కరోనా కలకలం ఇంట్లో తప్పక ఉంచుకోవాల్సినవి ఇవే! కరోనా వైరస్ మళ్లీ దేశంలో అలజడి సృష్టిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు వేలల్లో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
టెస్టులు, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు కూడా స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావాన్ని గుర్తించడంతో పాటు దీనికి చెక్ పెట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రకాల హెల్త్ గాడ్జెట్స్‌ను ఇంట్లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో పరిశీలిద్దాం.
ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్
కరోనా సోకిన వ్యక్తికి సాధారణ లక్షణంగా జ్వరం ఉంటుంది. కాబట్టి వారి టెంపరేచర్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ అవసరం. థర్మామీటర్‌లో కరోనా సోకిన వ్యక్తి టెంపరేచర్ ఒకవేళ ఎక్కువగా ఉంటే, తగు జాగ్రత్తలు పాటించడానికి, వెంటనే వైద్యుడిని సంప్రదించడానికి అవకాశం ఉంటుంది.
పల్స్ ఆక్సిమీటర్
కరోనా సోకిన వ్యక్తులకు పల్స్ రేట్‌ను చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకుంటే వైరస్ కారణంగా వారిలో పల్స్, ఆక్సిజన్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురికావచ్చు. ఒకవేళ కరోనా సోకిన వ్యక్తి పల్స్, ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటే చాలా ప్రమాదం. దీంతో పల్స్ ఆక్సిమీటర్ ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో ఎవరికైన కరోనా సోకితే వారి పల్స్‌రేట్, ఆక్సిజన్ లెవల్స్‌ను ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎదైనా ఎమర్జెన్సీ ఉంటే త్వరగా వైద్యుడిని సంప్రదించడానికి ఆస్కారం ఉంటుంది.
స్టీమర్ నెబ్యులైజర్ మెషిన్
స్టీమర్, నెబ్యులైజర్స్ ద్వారా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మెషిన్ ఉబ్బసం ఉన్న వ్యక్తులకు బాగా ఉపయోగపడతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికైనా కరోనా సోకితే, వారికి జలుబు, దగ్గు లక్షణాలుంటే, ఈ మెషిన్ ద్వారా వారికి త్వరగా ఉపశమనం కల్పించవచ్చు.
స్మార్ట్‌వాచ్
స్మార్ట్‌వాచ్‌లు కేవలం శారీరక శ్రమను ట్రాక్ చేయడమే కాకుండా ఇతర ఆరోగ్య విషయాలను తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కరోనా సోకిన వ్యక్తికి పల్స్, హృదయ స్పందన రేటు, SpO2 స్థాయిలను తప్పనిసరిగా ట్రాక్ చేయాలి. ఈ ఫీచర్స్ ఇప్పుడు స్మార్ట్ వాచ్‌ల్లో అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా స్మార్ట్‌వాచ్‌ను తీసుకోవడం మంచిది. ఒకవేళ షుగర్ వ్యాధి ఉన్నవారికి కరోనా సోకితే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించడానికి గ్లూకోమీటర్ అవసరం. కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది.
UV-C శానిటైజర్, ల్యాంప్
మనం చేతులను శుభ్రం చేసుకున్నా, వివిధ అవసరాల కోసం వాడే ఫోన్, కీ వంటి వస్తువులపై సూక్ష్మ క్రిములు ఉంటాయి. దీంతో వాటిపై ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపడానికి UV-C శానిటైజర్ మెషీన్స్, ల్యాంప్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం వీటిలో స్పెషల్‌గా ఓ లైట్ ఉంటుంది.
డిజిటల్ బ్లడ్ ప్రెజర్ మానిటర్
ఇటీవల కాలంలో చాలా మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కరోనా తరువాత ఈ సమస్య అధికమైంది. ప్రస్తుతం మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా ఇంట్లో డిజిటల్ బ్లడ్ ప్రెజర్ మానిటర్ ఉంచుకోవడం మంచిది. ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే వారి శరీర లక్షణాలను ట్రాక్ చేయడానికి డిజిటల్ బ్లడ్ ప్రెజర్ మానిటర్ ఉపయోగపడుతుంది. తద్వారా వైద్య చికిత్స సకాలంలో పొందవచ్చు.
మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ లో ఆర్ఐ భాగ్యలక్ష్మిని సస్పెండ్ చేసిన కలెక్టర్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేటితో పూర్తికానున్న ఇంటర్ వాల్యుయేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* దేశంలో మళ్లీ కరోనా కలకలం ఇక్కడ క్లిక్ చేయండి