రేపు ప్రపంచ మేధావి జన్మదిన వేడుకలు విజవంతం చేయాలి
* డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 132 వ జయంతి
* గౌరవ MLA పైలెట్ రోహిత్ రెడ్డి
* అంబేద్కర్ వాదులు దళిత సంఘాల నాయకులు
* ప్రజా సంఘాల నాయకులు
తాండూర్ Tandur News : ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ Dr.B.R. Ambedkar గారి 132 వ జయంతిని తాండూర్ పట్టణంలో గౌరవ MLA పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు దళిత సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇంతకు ముందు ఎన్నడూలేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉదయం 8: 30 గం.లకు DJ సౌండ్ డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ( రైతు బజార్ ) లో భారీ మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది.
కావున తాండూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి మరియు తాండూర్ టౌన్ నుండి నాయకులు యువకులు అంబేద్కర్ వాదులు దళిత సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు యువజన సంఘాలు,ప్రజలు ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున పాల్గొనాలి.ఉదయం 8 : 30 గం.లకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో కి రావాలి అక్కడే ఉదయం టిఫిన్,మధ్యాహ్నం 12 గంటలకు మీటింగ్ దగ్గర లంచ్ ఉంటుంది. ఇలాంటి డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను ఇంతకు మునుపెన్నడు జరుగని విధంగా చాలా స్పెషల్ గా గ్రాండ్ గా నిర్వహించుకోవడం జరుగుతుంది.కావున ప్రతి ఒక్కరు సమయానికి వచ్చి డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
![]() |
Only Just Rs 2,399/- Mantra Buy Now |