మైల్వార్ గ్రామంలో పౌర హక్కులపై ప్రజలకు అవగాహన ఎంఆర్ఓ,ఎస్ఐ
బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో పౌర హక్కులపై ప్రజలకు అవగాహన ఉండాలని తహసీల్దార్ వెంకటస్వామి సూచించారు. పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం రోజున మండల పరిధిలోని మైల్వార్ గ్రామంలో ఎంఆర్ఓ వెంకటస్వామి,ఎస్ఐ విద్యారణ్ రెడ్డి,హాస్టల్ వార్డెన్ రాధిక కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరాజ్యాంగం దేశ పౌరులందరికి సమాన హక్కులు కల్పించిందన్నారు. వీటిపై అవగాహన పెంచు కుంటేనే సమాజంలో మార్పు వస్తుంది అని తెలిపారు.గ్రామస్తులంతా సోదరభావంతో మెలగాలని సూచించారు. అంటరానితనం అవమానుషమని ఎవరైన పాటిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమాలలో గ్రామస్థులు తదితరులు పాల్కొన్నారు.