అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సీజ్
బషీరాబాద్ Basheerabad News : బషీరాబాద్ మండల పరిధిలోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎన్కేపల్లి గ్రామానికి చెందిన నీల మైపాల్ టీఎస్34 హెచ్ 2259, గోనూర్ గ్రామానికి చెందిన చామకూర రమేష్ తన టీఎస్ 34 బి8420 గల ట్రాక్టర్లతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గోనూర్ గ్రామం నుంచి కాశింపుర్ వైపు అక్రమ ఇసుక తరలిస్తుండగా రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ రెండు ట్రాక్టర్లు సీజ్ చేసినట్లు ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపారు.