అభివృద్ధిని చూసే బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు
- పార్టీ అబివృద్దికి కృషి చేస్తానని పార్టీ సిద్ధాంతాలు
- సీసీ రోడ్డును ప్రారంభించి,అంబేద్కర్ విగ్రహాం కోసం భూమి పూజ
- గ్రామానికి ఆర్టీసీ బస్సు వేళల్లో మార్పులు,మత్స్యసహకార సొసైటీ
- ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ మథకాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తాండూరు ఎమ్యెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరుకు చెందిన బీజేపీ నాయకుడు,వికారాబాద్ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రాంజీ రాథోడ్,ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్‌లోకి చేరారు. శనివారం క్యాంపు కార్యాలయంలో రాంజీ రాథోడ్‌తో పాటు ఆయన మద్దతుదారులు అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారందరికీ ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం రాంజీ రాథోడ్ మాట్లాడుతూ తాండూరు చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా అభివృద్ధి జరుగుతుందని సీఎం కేసీఆర్,ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గార్ల అభివృద్దికి ఆకర్షితులమై బీఆర్ఎస్ లోకి చేరామన్నారు.యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి, పార్టీ అబివృద్దికి కృషి చేస్తానని పార్టీ సిద్ధాంతాలు విధివిధానాలను లోబడి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా తమ కార్యాచరణను కొనసాగిస్తానని తెలిపారు.
పల్లెపల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పర్యటించి,ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకొని,రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.రూ.22 లక్షల 50 వేలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభం చేసి అనంతరం రూ.9 లక్షలతో స్కూల్ లో సైన్స్ ల్యాబ్ ఓపెనింగ్, రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మరియు రేళ్లగడ్డతాండాలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ కోసం శంకుస్థాపన చేశారు.పగిడిపల్లి గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి,అంబేద్కర్ విగ్రహాం కోసం భూమి పూజ చేశారు.
ఎమ్యెల్యే పర్యటన సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు.అక్కంపల్లి గ్రామంలో 1 లక్ష రూపాయలతో ఆటస్థలం ప్రారంభం,రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడం జరిగింది.అలాగే యువత కోరిక మేరకు ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహాలు,గ్రామానికి ఆర్టీసీ బస్సు వేళల్లో మార్పులు,మత్స్యసహకార సొసైటీ కోసం అధికారులతో మాట్లాడటం జరిగింది.
మరిన్ని వార్తల కోసం...
- అభివృద్ధిని చూసే బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు ఇక్కడ క్లిక్ చేయండి
- ఎక్సప్రెస్ రైలు ఆపడం లేదని నిరసన ఇక్కడ క్లిక్ చేయండి
- పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక్కడ క్లిక్ చేయండి