తాండూరుకు కచ్చింగా వస్తానన్న కేసీఆర్
* ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సిఎం కేసీఆర్ హామీ
* అరగంట పాటు ఇరువురి భేటీ
* రోహిత్ నేను తాండూరుకు వస్తున్నా
* అతిరుద్ర మహాయాగంలో పాల్గొంటా
* గృహప్రవేశంకు రాలేకపోయాను,ఈ సారి ఖచ్చితంగా వస్తాను
* నీకు అండగా నేనుంటాను
తాండూరు Tandur News భారత్ ప్రతినిధి : ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాత్రి అరగంట పాటు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో భేటీ అయ్యారు. తాండూరులో వచ్చేనెల 3నుంచి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు రోహిత్ రెడ్డి ప్రగతిభవన్ కు వెళ్లారు. ఈ సందర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాండూరు ఎమ్మెల్యేను ఆప్యాయంగా పలకరించారు. రోడ్డు ప్రమాదంకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీరు సమకూర్చిన బులెట్ ప్రూఫ్ కారు ఉండడంతో ప్రమాదం నుంచి బయట పడినట్లు రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రితో పేర్కొన్నారు.వచ్చేనెల 3 నుంచి నిర్వహిస్తున్న యాగం గురించి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇంత భారీ యాగం నిర్వహించడం గొప్ప విషయంగా సిఎం కేసీఆర్ అభినందించారు. యాగంకు వివిధ పీఠాధిపతులు వస్తున్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే వివరించారు. తాండూరులో నిర్వహించిన గృహప్రవేశంకు రాలేకపోయాను చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగినట్లు తెలిసింది.40 వేల మందికి భోజనాలు పెట్టావట అని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.ఈ సారి నిర్వహించే యాగంకు ఖచ్చితంగా వస్తాను తాండూరులో నిర్వహించే యాగంలో పాల్గొంటా అని రోహిత్ రెడ్డితో పేర్కొన్నారు.తాండూరుకు మంజూరు చేసిన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డిఎఫ్) పనుల పురోగతిపై కూడా ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి చర్చించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. తాండూరులో నీకు తిరుగులేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.నీకు ఎలాంటి దిగులు వద్దు నేను నీకు అండగా ఉంటాను అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సిఎం కేసీఆర్ అభయమిచ్చారు.